Posts

Showing posts from March 30, 2023

తులసి వనం 16

 ఉదయం బయటికి వచ్చిన ప్రసాద్ కి సెంటర్ లో వల్లి భర్త కామేశ్వరరావు కనిపించాడు తననే చూసి నవ్వుతుంటే బండి ఆపి ఏమిటి కనిపించడం లేదు ఈమధ్య అని అడిగాడు ప్రసాద్,,, ఏంలేదు ప్రసాద్ మా మామయ్య గారు ఆసుపత్రిలో వున్నారు పది రోజులు నేను, వల్లి , అక్కడే ఉండవలసి వచ్చింది అన్నాడు కామేశ్వరరావు,,,, అందుకే వల్లి నందు గాడితో టచ్ లో లేదు అని మనసులో అనుకుంటూ,, ఓహో అలాగా ఇప్పుడు ఎలా ఉంది పాపం అని అడిగాడు ప్రసాద్,,,,, కొంచెం పర్వాలేదు ప్రసాద్ బాగానే ఉంది వల్లి ని అక్కడే వుంచి వచ్చేసా రెండు రోజులు వుండి వచ్చేస్తుంది అని చెప్పాడు కామేశ్వరరావు,,,,ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కొంచెం దూరంగా నడుచుకుంటూ వెళుతున్న నందు గాడు కనిపించాడు ప్రసాద్ కి, కామేశ్వరరావు తో మాట్లాడుతూనే వాడిని చూస్తూన్నాడు,,,, వీడేమిటి కాలేజీ కి వెళ్ళే రూట్ కాకుండా అటు వెళుతున్నాడు అనుకుంటుండగానే తన ఇంటికి పోయే సందు వైపు తిరిగాడు నందు , ప్రసాద్ కి ఎక్కడో కొడుతుంది రెండు నిమిషాలు కామేశ్వరరావు తో మాట్లాడి,,సరే మళ్లీ కలుద్దాం అంటూ బండి వెనక్కి తిప్పి తన ఇంటి వైపుకు వెళ్తూ దూరంగా నడుస్తున్న నందు గాడిని చూసి కొంచెం స్లో చేసాడు బండి ని వాడి కి కనిపించ