Posts

Showing posts from October 5, 2022

తులసి వనం 10

 నందు గాడి ని చూసిన ప్రసాద్ కాసేపు అయోమయ స్థితిలో వున్నాడు ఎన్నో ఆలోచనలు ఒకే సారి బుర్ర కి ప్రశ్నలు దాడి చేస్తుంటే వాడు సైకిల్ దిగి ప్రసాద్ దగ్గరకు వస్తుంటే చిన్న స్మైల్ ఇవ్వడం తప్పక నవ్వుతూ ప్రశ్నార్థకంగా చూస్తుంటే వాడు సరాసరి వచ్చి ప్రసాద్ కాళ్ల మీద పడి నన్ను క్షెమించండి సార్ మీలాంటి మంచి వాళ్లని పట్టుకుని దురుసుగా ప్రవర్తించాను ఇప్పుడే మా నాన్న మీ గురించి చెపితే చాలా బాధ పడ్డాను ముమ్మాటికీ నేను చేసింది తప్పే అంటూ బాధపడుతున్నాడు ప్రసాద్ కొంచెం తేరుకుని అటూ ఇటూ చూసాడు ఎవరైనా చూస్తూన్నారేమో అని ఎవరూ లేక పోవడంతో వాడి బుజాల మీద చేతులు వేసి పైకి లేపాడు వాడు తల వంచుకుని నుంచున్నాడు నందు,. ...... ప్రసాద్ కి వాడు నిజాయితీగానే తప్పు ఒప్పుకున్నాడు అనిపించింది ... సరే లే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదులే ఏదొ జరిగింది వదిలేయ్ నేను మరిచిపోయాను నువ్వు మరిచి పో ఇంతకీ నువ్వు రామారావు కొడుకువా అని అడిగాడు ప్రసాద్, అవును మా నాన్నే అన్నాడు తల ఊపుతూ హొ. అంటూ అయితే నీకు ముందరే తెలుసా మా పొలం కవులకి తీసుకుంటూన్నాడు మీ నాన్న అని అడిగాడు నందు గాడి ని వాడు లేదండి నిన్న నే తెలిసింది నాకు అన్నాడు వాడ